Latest NewsLive ScoreIPL T20

ఢిల్లీ క్యాపిటల్స్ దెబ్బ.. రాజస్థాన్ రాయల్స్ అబ్బా| IPL 2026లో ఘన విజయం

జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉగ్రరూపం : రాజస్థాన్ రాయల్స్‌కు చావు దెబ్బ!

క్రికెట్ మిత్రులకు స్వాగతం సుస్వాగతం !

ఐపీఎల్ 2026లో మరో హై-వోల్టేజ్ పోరుకు జైపూర్ వేదికైంది. ఇలాంటి మ్యాచ్ చూస్తాము అనుకోలేదు ,ఇరు జట్లు పరుగుల వరద కురిపించారు. రాజస్థాన్ నిర్దేశించిన 226 పరుగుల బారి లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ అత్యంత సునాయాసంగా విజయం సాధించి .ఢిల్లీ ఫాన్స్ మాత్రం ఓక్కసారిగి ఊపిరిపీల్చుకున్నారు, వరుస ఓటములతో సతమతమవుతున్న ఢిల్లీకి ఈ విజయం ఒక ‘సంజీవని’ లాంటిదని చెప్పవచ్చు.

🔥 మ్యాచ్ హైలైట్స్: పాయింట్స్ లో చూడండి

  • ఛేదనలో మస్ క్లాస్ ప్రదర్శన: 226 పరుగుల భారీ టార్గెట్ అంటే ఏ జట్టుకైనా వణుకు పుడుతుంది. కానీ ఢిల్లీ ఓపెనర్లు మొదటి నుంచి ఊహించని విదంగా ఎదురుదాడి చేసారు.
  • రాహుల్ మార్క్ ఇన్నింగ్స్: కెఎల్ రాహుల్ (75) తన క్లాస్ మాస్ షాట్లతో రాజస్థాన్ బౌలర్లలకు చుక్కలు చూపించాడు.
  • పరాగ్ ఒంటరి పోరాటం వృధా : ఢిల్లీ బౌలర్ల పై విరుచుకు పడ్డ కెప్టెన్ రియాన్ పరాగ్ (90) పరుగులతో రాణించాడు. కెప్టెన్ పాత్ర పోషించాడు కానీ బౌలర్ల వైఫల్యం జట్టును ముంచేసింది.
  • టర్నింగ్ పాయింట్: రాజస్థాన్ ని దెబ్బకొట్టిన మిచెల్ స్టార్క్ .బ్యాటింగ్ తో విరుచుకుపడుతున్న పరాగ్‌ను అవుట్ చేయడంతో రాజస్థాన్ 20-30 పరుగులు తక్కువ చేసింది.

🏏 పవర్-ప్యాక్డ్ బ్యాటింగ్: ఢిల్లీ జోరు

ఢిల్లీ బ్యాటింగ్ చూస్తుంటే ఈరోజు టీం లో ఒక కసి కనిపించింది ఎలాగైనా గెలవాలి అని . ముఖ్యంగా KL రాహుల్, పథుమ్ నిస్సంక జోడీ మొదటి వికెట్‌కు 110 పరుగులు జోడించి మ్యాచ్‌ను ఢిల్లీ వైపు తిప్పేశారు .

ప్లేయర్పరుగులుబంతులుస్ట్రైక్ రేట్
KL రాహుల్7540187.5
పథుమ్ నిస్సంక6233187.8
అశుతోష్ శర్మ25*11227.2

రాజస్థాన్ రాయల్స్: కెప్టెన్ మెరుపులు.. చివర్లో ఫెరీరా హంగామా

రాజస్థాన్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది.రాజస్తానికి టీమ్కి ఆయువుపట్టు అయిన ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ ఒకరు తరువాత ఒకరు అవుట్ అవ్వడంతో రాజస్థాన్ దేవం డీలాపడింది .అయితే రియాన్ పరాగ్ ఢిల్లీ బౌలర్ల పై విరుచుకు పడుతు తన పోరాటాన్ని కొనసాగించి 90 పరుగులు చేసాడు . చివర్లో డోనోవన్ ఫెరీరా కేవలం 14 బంతుల్లోనే 47 పరుగులు చేసి స్కోరును 225కు చేర్చాడు. కానీ ఢిల్లీ బ్యాటర్ల ధాటికి ఈ స్కోరు సరిపోలేదు.

🎯 మ్యాచ్ ఫలితం: ఢిల్లీ ఈజ్ బ్యాక్!

కీలక సమయంలో ట్రిస్టన్ స్టబ్స్ మరియు అశుతోష్ శర్మ ఇద్దరు కలసి ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది పెట్టారు . ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ ప్లే-ఆఫ్ రేసులోకి దూసుకొచ్చింది.

🌟 మా విశ్లేషణ (Expert Opinion):

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓటమికి ప్రధాన కారణం వారి డెత్ ఓవర్ల బౌలింగ్ సరిగ్గా చెయ్యకపోవడం . 225 పరుగులు చేసినా డిఫెండ్ చేసుకోలేకపోవడం ఆందోళన కలిగించే విషయం. మరోవైపు ఢిల్లీకి రాహుల్ ఫామ్‌లోకి రావడం అతిపెద్ద ప్లస్ పాయింట్.

మీకు ఈ మ్యాచ్‌లో ఎవరి బ్యాటింగ్ బాగా నచ్చింది? కింద కామెంట్ చేయండి!

CricTelugu Desk

Welcome to CricTelugu.com – Your Trusted Telugu Cricket News Platform. CricTelugu.com provides the latest IPL news, live cricket scores, match predictions, cricket updates, player statistics, and breaking cricket news in Telugu.

Instagram

Follow

FaceBook

Follow

Leave a Comment