178 పరుగుల లీడ్.. భారత్ దెబ్బకు శ్రీలంక విలవిల!
భారత్ vs శ్రీలంక Day 4 మ్యాచ్‌పై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసిన భారత్, శ్రీలంకను 284 పరుగులకు ఆలౌట్ చేసి 178 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. దీంతో నాలుగో రోజు టీమిండియా వ్యూహం ఏంటి? ఎంత వేగంగా రెండో ఇన్నింగ్స్ ఆడుతుంది? ఎప్పుడు డిక్లేర్ చేస్తుంది? అనే ప్రశ్నలు ఆసక్తిని పెంచుతున్నాయి.
భారత్ vs శ్రీలంక Day 4 : శ్రీలంక గాలే వేదిక ఆతిధ్యం ఇస్తున్న మొదటి టెస్ట్ లో భారత్ ఆధిక్యం కనబరుస్తుంది. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ లో 284 పరుగులకే కుప్ప కూలింది.దాంతో భారత్ ఆధిక్యం 178 పరుగులు లభించినట్టు ఉంది .భారత్ దెబ్బకు శ్రీలంక 90 పరుగులకే 5 కీలక వికెట్స్ కోల్పోయిన తిరిగి పుంజుకొని ఆ మాత్రం స్కోర్ చెయ్యగలిగింది,అంతకుముందు భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 462 పరుగులకే అల్ అవుట్ అయ్యింది.
శ్రీలంక ను ఆదుకున్న డిక్వెల్లా దినుషా !
మొదటి ఇన్నింగ్స్ లో శ్రీలంక భారత్ బౌల్ర్స్ దెబ్బకు ఒక్కొకరుగా క్యూ కట్టారని చెప్పాలి ,90 పరుగులకే 5 కీలక వికెట్స్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్నపుడు 146 పరుగుల కీలక భాగసామ్యాన్ని నెలకొల్పి రు.పుంజుకుంటున్న సమయంలో డిక్వెల్లా ను 80 పరుగుల వద్దు భారత్ అవుట్ చేసింది. మరో వైపు ధాటిగా ఆడుతున్న దినుష టెస్ట్ లో తన తొలి సెంచరీ పూర్తి చేసాడు.
మానవ్ సుతార్ 4 వికెట్స్ జడేజా 3 వికెట్స్ !
భారత్ బౌలింగ్ లో ఊహించని పరిణామాలే జరిగాయి అని చెప్పవచ్చు .యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ దెబ్బకు శ్రీలంక బ్యాట్సమెన్ క్యూ కట్టారు.తన స్పిన్ మాయాజాలం తో ఊపిరి ఆడకుండా చేసాడు అదే సమయంలో స్టార్ అల్ రౌండర్ జడేజా 3 వికెట్స్ తీసి శ్రీ లంక వెన్ను విరిచారు .
శ్రీలంక ఆశలు ఇంకా బతికే ఉన్నాయా !
భారత్ రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టి బారి లక్ష్యాన్ని ముందే పెడితే మాత్రం శ్రీ లంక కష్టపడాల్సింది ,శ్రీలంక బ్యాట్సమెన్ పై మరింత భారం పడే అవకాశం ఉంది.ఒక వైపు స్పిన్ తో శ్రీలంక బ్యాటమెన్ ముప్పు తిప్పలు పెడుతున్న భారత్ స్పిన్నర్లు మానవ్ సుతార్ .జడేజా ,కుల్దీప్ యాదవ్ శ్రీలంక టీమ్ పై మరింత ఒత్తిడి పెంచే అవకాశం ఉంది.కానీ శ్రీలంక మరో మార్గంలో వెళ్ళవచ్చు వికెట్స్ చేజార్చుకోకుండా సమయాన్ని గడిపి చివరి రోజు వరకు మ్యాచ్ ని తీసుకెళ్లి డ్రా చెయ్యడానికి కూడా ప్రయత్నిచే అవకాశం ఉంది .కానీ భారత్ బారి స్కోర్ ఆధిక్యాన్ని పెంచుతే మాత్రం సీన్ పూర్తిగా మరి భారత్ కు గెలుపు అవకాశములు మెరుగ్గా ఉన్నాయి
4వ రోజు ఆట ఎవరి చేతిలోకి వెళ్తుంది !
నాలుగోవ రోజు భారత్ ఎంత తక్కువ టైంలో ఎన్ని రన్స్ చేస్తుంది ,ఎప్పుడు డిక్లర్ చేస్తుంది అన్నదే మొత్తం మ్యాచ్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్ మొదటి నుంచి దూకుడుగ ఆడి 300 నుంచి 400 రన్స్ పరుగుల ఆధిక్యాన్ని శ్రీ లంక ముందు ఉంచుతే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరి కీలక విషం ఈ మ్యాచ్ కి వర్షం గండం కాచుకొని కూర్చింది.అందుకే భారత్ కు సమయం రన్స్ కీలకంగా మారనున్నాయి.
- Latest Cricket News
Latest Cricket News – CricTelugu.com - Cricket News & Updates
Cricket News & Updates – CricTelugu.com - Cricket Analysis
Cricket Analysis – CricTelugu.com - Latest Articles
Latest Cricket Articles – CricTelugu.com - ICC India Team
ICC India Team – Official Website - Sri Lanka Cricket
Sri Lanka Cricket – Official Website





