Latest NewsLive ScoreIPL T20

బంగ్లాదేశ్ దెబ్బ భారత్‌కు కొత్త టెన్షన్

Published On: August 18, 2026 8:02 AM
బంగ్లాదేశ్ దెబ్బ భారత్‌కు టెన్షన్. బంగ్లాదేశ్ దెబ్బతో భారత్‌కు టెన్షన్ – WTC ఫైనల్ రేసులో మారిన లెక్కలు

బంగ్లాదేశ్ దెబ్బ భారత్‌కు కొత్త టెన్షన్! WTC ఫైనల్ రేసులో మారిన లెక్కలు ఇవే

బంగ్లాదేశ్ దెబ్బ భారత్‌కు టెన్షన్ పెంచింది. ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సాధించిన సంచలన విజయం World Test Championship (WTC) ఫైనల్ రేసులో లెక్కలను మార్చేసింది. ఈ విజయంతో బంగ్లాదేశ్ పాయింట్ల పట్టికలో భారత్‌ను దాటడంతో టీమ్ ఇండియాపై ఒత్తిడి మరింత పెరిగింది.

డార్విన్ లో జరిగిన తొలి టెస్ట్ లో బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాను ఘోరంగా ఓడించింది. అది కూడా ఆస్ట్రేలియా గడ్డపై ఏకంగా 9 వికెట్ల తో చరిత్ర సృష్టించింది , దింతో ఆస్ట్రేలియా ఫ్యాన్స్ సీనియర్స్ ఆటగాళ్లు పై విరుచుకు పడుతున్నారు.ఒక ఫాన్స్ అయితే స్మిత్ పై డైరక్ట్ గ బూతులతో విరుచుకు పడ్డాడు .ఈ విజయం కేవలం బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలోనే గొప్ప మెయిలు రాయి అని చెప్పవచ్చు . బాంగ్లాదేశ్ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో పాయింట్ల పట్టిక పై బారి ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది

బంగ్లాదేశ్ సాధించిన ఈ విజయం తో పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ నాలుగో స్థానానికి ఎగబాకింది. భారత్ మాత్రం ఐదో స్థానంలో కొనసాగుతోంది.

టీమ్ ఇండియా వరల్డ్ ఛాంపియన్ రేసులో ఉంటుందా !భారత్ టీమ్ టెస్ట్ మ్యాచ్ లు హోమ్ గ్రౌండ్ లో ఓడిపోయిన తరువాత వరల్డ్ ఛాంపియన్ షిప్ కి కష్టంగా మారిందని చెప్పాలి ,రేస్ లో ఉండాలంటే ఎప్పటి నుంచి ఆడే ప్రతి మ్యాచ్ లో గెలవాల్సిందే

బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాను షాక్ ఇచ్చింది ?

బాంగ్లాదేశ్ టీమ్ ఆస్ట్రేలియా టీమ్ కి కోలుకోలేని దెబ్బ కొట్టిందని చెప్పాలి. దారివైన లో జరిగిన తొలి టెస్ట్ లో బాంగ్లాదేశ్ ఫేసర్ హాసన్ మహ్మద్ దాటికి క్యూ కట్టారు అని చెప్పాలి ,స్టార్ బ్యాట్సమెన్ లు ఉన్న టీం కుప్పకూలడం టీమ్ మానేజ్మెంట్ జీర్ణించుకోలేక పోయింది .మొత్తనికి మొదటి ఇన్నింగ్స్ లో 198 పరుగులకే అల్ ఔట్ అయ్యింది ,బాంగ్లాదేశ్ 426 పరుగులు చేసి బారి ఆధిక్యం సాధించింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 284 పరుగులు చేయగా బాంగ్లాదేశ్ ఒక్క వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది, బాంగ్లాదేశ్ జట్టు 9 వికెట్స్ తో ఆస్ట్రేలియా జట్టు పై విజయం సాధించింది . ఈ విజయం బాంగ్లాదేశ్ జట్టుకు ఆస్ట్రేలియా పై మొదటి విజయంగా చెప్పుకోవచ్చు,దింతో బాంగ్లాదేశ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ కు 12 పాయింట్స్ తో 4 వ స్థానంలోకి ఎగబాకింది, ఆస్ట్రేలియా కి మాత్రం ఈ మ్యాచ్ ద్వారా ఒక్క పాయింట్ కూడా దక్క లేదని చెప్పాలి.

WTC పాయింట్ల పట్టికలో ఏం మారింది?

తాజా WTC standings ఇలా ఉన్నాయి:

| స్థానం | జట్టు | PCT |
| —— | ————- | —–: |
| 1 | ఆస్ట్రేలియా | 77.78% |
| 2 | దక్షిణాఫ్రికా | 75.00% |
| 3 | న్యూజిలాండ్ | 72.22% |
| 4 | బంగ్లాదేశ్ | 66.67% |
| 5 | భారత్ | 48.15% |

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్ కంటే ముందుంది.

అంటే WTC Final కోసం పోటీ పడుతున్న జట్ల సంఖ్య పెరిగింది.

భారత్‌కు ఇది నేరుగా “బంగ్లాదేశ్ వల్ల ఫైనల్ అవకాశం పోయింది” అనే పరిస్థితి కాదు. కానీ ముందున్న జట్ల సంఖ్య పెరగడంతో భారత్‌కు margin for error తగ్గింది.

భారత్‌కు అసలు టెన్షన్ ఎక్కడుంది?

భారత్ ప్రస్తుతం 48.15% PCTతో ఐదో స్థానంలో ఉంది.అంటే కేవలం ఇతర జట్లు ఓడిపోవాలని ఎదురుచూడటం సరిపోదు. ఇక నుంచి భారత్ ఆడే ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే. శ్రీలంక టెస్ట్ సిరీస్ చాల కీలంకంగా మారె అవకాశం ఉంది , ఈ సిరీస్ గెల్చిన కూడా ఇక ఆడోబోయే ప్రతి మ్యాచ్ కీలంకం కానుంది

భారత్‌కు ఎన్ని మ్యాచ్‌లు గెలుస్తే ఫైనల్ కి చేరుతుంది !

బంగ్లాదేశ్ దెబ్బ భారత్‌కు భారత్‌కు కొత్త టెన్షన్: భారత్ ప్రస్తుతం 9 టెస్టులు ఆడింది. ఇంకా 9 టెస్టులు మిగిలి ఉన్నాయి.ప్రస్తుత 48.15% నుంచి గణనీయంగా పైకి చేరుకోవాలంటే భారత్ మిగిలిన మ్యాచ్‌ల్లో భారీ విజయాలు నమోదు చెయ్యాల్సిందే.భారత్ మిగిలిన 9 టెస్టుల్లో 7 గెలిస్తే సుమారు 63% PCT వరకు చేరుతుంది. వరుస రెండు శ్రీలంక టెస్టులను గెలిచినా భారత్ సుమారు 57% వద్దకు చేరుతుంది.వరుసగా విజయాలు సాధిస్తే ఫైనల్ రేసులోకి బలంగా దూసుకెళ్లే అవకాశం ఉంది.బాంగ్లాదేశ్ విజయం ఆస్ట్రేలియా ఓటమితో తో పాయింట్ పట్టికలో మార్పులు జరిగే అవకాశం ఉంది .

CricTelugu Desk

Welcome to CricTelugu.com – Your Trusted Telugu Cricket News Platform. CricTelugu.com provides the latest IPL news, live cricket scores, match predictions, cricket updates, player statistics, and breaking cricket news in Telugu.

Instagram

Follow

FaceBook

Follow

Leave a Comment