Latest NewsLive ScoreIPL T20

శ్రీలంకను చిత్తు చేసిన భారత్.. 165 పరుగుల భారీ విజయం

Published On: August 19, 2026 8:58 PM
India vs Sri Lanka 1st Test 2026. India vs Sri Lanka 1st Test 2026లో 165 పరుగుల తేడాతో భారత్ విజయం సందర్భంగా శుభ్‌మన్ గిల్‌తో భారత జట్టు సంబరాలు

India vs srilanka : గాలేలో భారత్ ఘనవిజయం

India vs Sri Lanka 1st Test 2026:  గాలేలో భారత్ ఘన విజయం.. 165 పరుగులతో శ్రీలంకపై ఆధిపత్యం, మానవ్ సుతార్ 10 వికెట్ల సంచలనం

శ్రీలంక గాలే వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం.భారత్ మెరుగైన ప్రదర్శన తో అన్ని విభాగాల్లో రాణిచందని చెప్పాలి ,165 పరుగుల తేడాతో ఆతిధ్య శ్రీలంక జట్టును ఓడించింది.ముక్యంగా భారత్ జట్టు బ్యాటింగ్ బౌలింగ్ లో అద్భుతమైన ప్రదర్శన కనపరిచింది.బ్యాటింగ్ విభాగంలో బ్యాటింగ్‌లో దేవదత్ పడిక్కల్ అద్భుతమైన శతకంతో జట్టుకు బలమైన పునాది వేయగా, బౌలింగ్‌లో యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అసాధారణ ప్రదర్శనతో మ్యాచ్‌ను భారత్ వైపు పూర్తిగా తిప్పేశాడు.శ్రీలంక జట్టును వరుణుడు కరుణిస్తాడేమో అనుకున్నారు కానీ ఆ అవకాశం లేకుండా భారత్ బౌలింగ్ విభాగం శ్రీలంక జట్టు చివరి వికెట్ ను పడగొట్టి విజయాన్ని ఖరారు చేసారు.కానీ మ్యాచ్ ముగిసిన 5 నిమిషాలలోనే బారి వర్షం,వరుణదేవుడు భారత్ ను వరించాడేమో.

భారత్ బ్యాటింగ్ బలపడిందా !

మ్యాచ్ కు ముందు భారత్ టీమ్ పై ఎన్నో అనుమానాలు దానికి కారణం భారత్ జట్టులో కీలకమైన ఆటగాళ్లు గాయాలబారిన పడడం.ఆ అనుమానాలను పటాపంచలు చేశారు యువ ఆటగాళ్లు.గాలే లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ విభాగం చాల జాగ్రత్త ఆడారని చెప్పాలి, శ్రీలంక లాంటి స్పిన్ పిచ్ లను పై లంక స్పిన్నర్లు ను ఎదుర్కొని ఆడడం కాస్త ఓపికతో కూడుకున్న పని అయిన భారత్ బ్యాటింగ్ లైనప్ ఏ మాత్రం తడపడకుండ ముందుకు సాగింది,భారత్ బ్యాటింగ్ విభాగంలో దేవదత్ పడిక్కల్ వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నదాడు.పడిక్కల్ మొదటి ఇన్నింగ్స్ లో 167 పరుగులు చేసి విజయానికి ప్రధాన కారణం అయ్యాడు అని చెప్పా వచ్చు .స్పిన్ ను ఎదుర్కొని కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు అందులో 15 ఫోర్స ఒక సిక్స్ కూడా ఉంది.కేఎల్ రాహుల్ దేవదత్ పడిక్కల్ మొదటి ఇన్నింగ్స్ లో జట్టుకు విలువైన భాగస్వామ్యాన్ని నిర్మించారు. మ్యాచ్ మధ్యలో రిటైర్డ్ హర్ట్ గ వెనుతిరిగిన మల్లి వచ్చి తనదైన శైలిలో 82 పరుగులు చేసి జట్టు కు బలమైన పునాది వేసాడు .ధృవ్ జురెల్ క్రీజ్ లో వేగంగా 51 పరుగులు చేసి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. బ్యాటింగ్ విభాగంలో సమిష్టి కృషి వల్లే మొదటి ఇన్నింగ్స్ లో బారి స్కోర్ శ్రీలంక జట్టు ముందు ఉంచింది

భారత్ కు మరో స్పిన్ మాంత్రికుడు దొరికాడా ! మానవ్ సుతార్ స్పిన్ మాయాజాలం
భారత్ బౌలింగ్ పై ఎన్నో అనుమానాలు ఉండేవి బుమ్రా లాంటి స్టార్ బౌలర్ గాయాల బారిన పడడం.స్పిన్ విభాగంలో సీనియర్ అల్ రౌండర్ జడేజా కుల్దీప్ యాదవ్ పై భారం ఎక్కువ పడుతుంది అనుకున్నారు కానీ యావ స్పిన్నర్ మానవ్ సుతార్ శ్రీ లంక టీమ్ నడ్డి విరిచారు అని చెప్పాలి.మానవ్ సుతార్ స్పిన్ దెబ్బకు శ్రీలంక జట్టు పేకమేడలా కూలిపోయింది అని చెప్పాలి.మొదటి ఇన్నింగ్స్ లో 4 వికెట్స్ రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్స్ తీసి భారత్ విజయంలో కీలక పాత్రపోషించాడని చెప్పాలి.

రెండో ఇన్నింగ్స్ లో రిషభ్ పంత్ దూకుడు !
భారత్ రెండో ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ ఐపీల్ మ్యాచ్ లో ఆడినట్టు శ్రీలంకపై విరుచుకు పడ్డాడు , రెండో ఇన్నింగ్స్ లో ఆధిక్యాన్ని పెంచడంలో కీలకంగా మారాడు .ఈ మ్యాచ్‌లో టెస్ట్ క్రికెట్‌లో 100 సిక్సర్లు పూర్తి చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రిషభ్ పంత్ చరిత్ర సృష్టించాడు.

ఐదో రోజు ఉత్కంఠ.. కానీ చివరికి భారత్‌దే విజయం

మ్యాచ్ చివరి రోజున శ్రీలంక నుంచి కొంత ప్రతిఘటన కనిపించింది. భారత్ గెలవడానికి వికెట్లు అవసరం కాగా, శ్రీలంక మ్యాచ్‌ను డ్రా వైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఇదే సమయంలో వర్షం కూడా మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపుతుందేమో అన్న అనుమానం కలిగింది.

కానీ భారత బౌలర్లు ఎక్కడా తొందరపడలేదు. ప్రతి వికెట్ కోసం సరైన ప్రణాళికతో బౌలింగ్ చేశారు. సుతార్ నాయకత్వంలో భారత బౌలింగ్ దళం చివరి వరకు ఒత్తిడిని కొనసాగించింది. చివరికి శ్రీలంక ఇన్నింగ్స్ ముగియడంతో భారత్ 165 పరుగుల అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

1. మ్యాచ్ పూర్తి వివరాలు:
India vs Sri Lanka 1st Test పూర్తి మ్యాచ్ రిపోర్ట్ – Reuters

2. మానవ్ సుతార్ 10 వికెట్ల ప్రదర్శన:
Manav Sutharపై Shubman Gill ప్రశంసలు – Reuters

3. భారత్ శ్రీలంక టెస్ట్ సిరీస్ షెడ్యూల్ & అధికారిక జట్టు వివరాలు:
BCCI అధికారిక India Sri Lanka Test Series వివరాలు

4. ICC World Test Championshipలో సిరీస్ ప్రాముఖ్యత:
India vs Sri Lanka Test Series – ICC

CricTelugu Desk

Welcome to CricTelugu.com – Your Trusted Telugu Cricket News Platform. CricTelugu.com provides the latest IPL news, live cricket scores, match predictions, cricket updates, player statistics, and breaking cricket news in Telugu.

Instagram

Follow

FaceBook

Follow

Leave a Comment